గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేత మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, వాణీదేవి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహా చార్యులు హాజరయ్యారు.