pakistani usman arrest is questioning the security of indian

ఉస్మాన్ అరెస్ట్…దేశరక్షణను ప్రశ్నింస్తుందా..?

40

వారం రోజుల క్రితం పాకిస్థాని అయిన ఉస్మాన్ ని అరెస్ట్ చేశారు హైద్రాబాద్ పోలీసులు, పూర్తి వివరాలను రాబట్టేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకున్నారు సిసియస్ అధికారులు. పాకిస్థాన్ కి చెందిన ఉస్మాన్ తో పాటు మరో నలుగురిని ఐదు రోజుల కస్టడీ పూర్తయింది. ఈ విచారణ వివరాలను కోర్ట్ కి తెలిపారు, విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది. కస్టడీ పూర్తయ్యాక నాంపల్లి న్యాయస్థానం లో హాజరుపరిచారు. పాకిస్థాన్ నుండి ఫ్లైట్ లో నేపాల్ అక్కడ నుండి బస్సు ద్వారా ఢిల్లీ కి అక్కడ నుండి హైద్రాబాద్ కు ట్రైన్ లో, ఢిల్లీలో పాకిస్థాన్ పాస్ పోర్ట్ ను చించేసి నేరుగా హైద్రాబాద్ చేరాడు.

ఇక్కడి నుంచి దుబాయ్ లో పెళ్ళడిన యువతీ దగరకు వేలాడు, ఆమెతో కలసి కాపురం చేశాడు. 2011 నుండి ఇలా హైద్రాబాద్ లోనే ఉంటున్నాడు ఉస్మాన్, ఉండడమే దొంగచాటుగా కనీసం మంచిగా అయినా ఉన్నాడా అంటే అది లేదు. తన భార్య మొదటి భర్త కు పుటిన అమ్మాయిని నగ్నంగా వీడియోలు తీశాడు, ఆ వీడియోలతో బెదిరింపులకు దిగేవాడు, బ్లాక్ మెయిల్ చేసేవాడు, ఇప్పటికే కొన్ని వీడియోలు సోషల్ మీడియా కు అమ్మేశా అని అనేవాడు, దీనితో ఆ మహిళ చేసేది ఏమిలేక సిసియస్ పోలీసులకు పిర్యాదు చేసింది.

అపుడు కానీ ఆ పాకిస్థాన్ విషయం బటబైలు కాలేదు. రంగంలోకి దిగిన పోలీసులు పాకిస్థానీ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు . అరెస్ట్ అయిన వాళ్లలో ఒక ప్రొఫెసర్ కూడా ఉన్నాడు, కరీంనగర్ కు చెందిన ఈ ప్రొఫెసర్ వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్స్ తయారుచేసి అమ్మడంలో కీలకం, టోలీ చౌకి, మలక్ పెట్, అంబర్ పెట్ లో నివాసం ఉంటాడు. దేశవ్యాప్తంగా పాతిక యూనివర్సిటీ పేర్లు ఇతగాడి డైరీలో ఉన్నాయి, వాటిని కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు.

యూనివర్సిటీలకు, ఈ గ్యాంగ్ కు ఉన్న సంబంధం ఏమిటి? లేక సొంతంగానే వీళ్ళు నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఉస్మాన్ పాకిస్థానీ, ఇతనికి ఈ నకిలీ సర్టిఫికెట్స్ తయారీకి సంబంధం ఏమిటి ? కేవలం ఈజీ మనీ సంపాదించడమే ద్యేయమా లేక ఇందులో మరేదైనా కుట్ర కోణం దాగి ఉందా ? నకిలీ పాస్ పోర్టులు కూడా తయారు చేస్తున్నాడు ఉస్మాన్, వీటిని ఎవరికోసం తయారుచేస్తునట్టు, ఇందులో దాగిన ఉగ్ర కోణం ఎమిటి ? ఐదు రోజుల కస్టడీ లో ఉస్మాన్ ఏమి చెప్పాడు ? వివరాలు తెలియాల్సి ఉంది.