telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్టికల్ రద్దు పై మండిపడ్డ పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది!

shahid afridi pakistan

జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ భారత ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాడు. ఐరాస తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ ప్రజలకు భారత ప్రభుత్వం కనీస హక్కులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అసలు ఐరాస ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలియడం లేదని వాపోయాడు.

హక్కుల ఉల్లంఘన ఈ స్థాయిలో ఉన్నప్పటికీ ఐరాస నిద్రపోతోందని దుయ్యబట్టారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రిది కోరాడు. ఈ మేరకు ట్వీట్ ను యూఎన్ఓ, డొనాల్డ్ ట్రంప్‌ కు ట్యాగ్ చేశాడు.

Related posts