పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కశ్మీర్‌లో విధించిన ఆంక్షలు తొలగించే వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌తో కొనసాగుతున్న దౌత్య సంబంధాలను సైతం నిలిపివేసింది. తాజాగా పాక్ ప్రధాని మరోసారి రెచ్చిపోయారు. అక్కడి ప్రాంతీయ మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుతాం. అప్పటి వరకు భారత్‌తో ఎలాంటి చర్చలు జరపంమని వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగిందని భారత్ అనేకసార్లు స్పష్టం చేసినప్పటికీ పాక్ భారత్‌పై తన మొండి వైఖరిని మార్చుకోవడంలేదు. అంతటితో ఆగకుండా మాటల యుద్ధానికి దిగుతోంది. అయితే కశ్మీర్ అంశం దేశ అంతర్గత విషయమని ఈ విషయంలో జోక్యం చేసుకోడానికి పాకిస్తాన్‌కు ఏ హక్కు లేదని భారత ప్రభుత్వం అనేకసార్లు పాక్‌కు తెలిపిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై కూడా ఇదే విషయాన్ని పలుమార్లు గుర్తుచేసింది.
అయినా భారతదేశంలో ఆంక్షల గురించి పాక్ చెప్పడం, మన ప్రభుత్వం వినడం హాస్యాస్పదం. ఇప్పటి వరకు పాక్ భూభాగంలో తీవ్రవాద స్థావరాలు ఉన్నాయంటే పట్టించుకోలేదుకాని, భారత్ మాత్రం పాక్ చెప్పగానే ఆంక్షలు తీసేయాలా అంటూ విశ్లేషకులు ఇమ్రాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
సాధ్వి ప్రజ్ఞా సింగ్ ముమ్మాటికీ ఉగ్రవాదే: సిద్ధరామయ్య