telugu navyamedia
రాజకీయ వార్తలు

చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

pakistan minister favad

చంద్రయాన్-2 ప్రయోగంపై యావత్ ప్రపంచం భారత్, ఇస్రోల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ మాత్రం తన అక్కసును వెళ్లగక్కింది. చేతకాని పని జోలికి వెళ్ళి బోర్లాబొక్కపడడం ఎందుకు? అంటూ పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరీ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ‘ఎండియా’ అంటూ భారత్ కథ ముగిసింది అనే ధోరణిలో వ్యంగాస్త్రాలు సంధించారు. దాంతో నెటిజన్లు ఆయనను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేశారు.

దాంతో మళ్లీ ట్విట్టర్ లో స్పందించిన ఫవాద్ హుస్సేన్, విఫల ప్రాజెక్టు కోసం రూ.900 కోట్లు ఖర్చు పెట్టమని ఎవరు చెప్పారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రధాని మోదీ తనేదో వ్యోమగామి అయినట్టు ప్రసంగాలు దంచుతున్నాడని వ్యాఖ్యానించారు. మరోవైపు పాకిస్తాన్ నెటిజన్లు మనకు సాధ్యం కానిది భారత్ చేస్తోందంటే ప్రోత్సహించాలి కానీ, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? దయచేసి పాకిస్థాన్ పరువు తీయొద్దు” అంటూ హితవు పలికారు.

Related posts