telugu navyamedia
రాజకీయ

భారత్‌లో రాయబారిని వెనక్కి పిలిచిన పాక్‌

pak will lose if war declared with india
పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్‌ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్‌ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్‌ పేర్కొంది. భారత్‌లో తమ హైకమిషనర్‌ సొహైల్‌ అహ్మద్‌ను చర్చల నిమిత్తం పాకిస్తాన్‌ పిలిపించామని పాక్‌ వెల్లడించింది. 
ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారని పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్‌ మహ్మద్‌ ఫైసల్‌ ట్వీట్‌ చేశారు. మరో వైపు దాడి జరిగిన మరుసటి రోజు పాక్‌లో భారత రాయబారిని సంప్రదింపుల కోసం ఢిల్లీకి పిలిపించారు.కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన ఉదంతంపై పాక్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన భారత్‌ ఆత్మాహుతి దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Related posts