కాశ్మీర్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ కలకలం రేపాయి. మన కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇక పాక్ బోర్డర్‌లో సెక్యూరిటీని పెంచారు. అయినప్పటికి భధ్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు అర్నియా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి ఓ డ్రోన్ ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేసింది. పాక్ వైపు నుంచి వస్తున్న డ్రోన్‌గా గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే డ్రోన్‌పై కాల్పులు జరిపాయి. అయితే, ఆ డ్రోన్ కాల్పుల నుంచి తప్పించుకొని వెనక్కి వెళ్లిపోయింది. రెక్కీ నిర్వహించేందుకు ఈ డ్రోన్‌ను వినియోగించి ఉంటారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
previous post
next post