telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పాక్ లో మోగిన … డిఫెన్స్ సైరన్ .. భయాందోళనలో ఆ దేశప్రజలు..

Pak people attack pak poilet

పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ ఆక్రమిత కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని తుదముట్టించడానికి సిద్ధం అయ్యింది. ఇటీవలే ఒక దాడికి కూడా పాల్పడింది భారత్. దీనితో ప్రతీకార దాడికి పాక్ సన్నద్ధం అవుతున్నట్టుగా, సివిలియన్ డిఫెన్స్ సైరన్ లను నేడు మోగించింది. యుద్ధం జరుగుతున్న వేళ శత్రు దేశపు విమానాలు బాంబులతో వస్తుంటే వీటిని మోగించి, ప్రజలను అప్రమత్తం చేస్తారు.

నిన్నటి సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా, ఈ ఉదయం ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో సైరన్ లను పాకిస్థాన్ మోగించింది. దీనితో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ సైరన్ లు ఉదయం నుంచి నిరాటంకంగా మోగుతున్నాయి. భారత్ పై దాడికి దిగాలన్న ఆలోచనలో ఉన్న పాక్, తమ పౌరులను అప్రమత్తం చేస్తోందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

Related posts