telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

దావుద్ ను .. పాక్ గుండెల్లో దాచుకుంటుంది.. భారత్..

pak contradict statement on davoodh

భారత విదేశాంగ అధికారులు మరోసారి పాక్ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీవ్రవాదం అణచివేస్తాం అంటూనే, అందుకు సహకరించడానికి మాత్రం ముందుకు అడుగులు వేయడానికి సహకరించడంలేదు. అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్‌ ఇబ్రహిం పాక్ లో లేడనే ప్రకటనను ఆ దేశ ద్వంద వైఖరిని మరోసారి స్పష్టంగా తెలియజేస్తుందని భారత అధికారులు తీవ్రంగా ఖండించారు. దావూద్‌ ఇబ్రహీం ఖచ్చితంగా కరాచిలో ఉన్నాడని, కరాచీలోనే బహిరంగంగా తిరుగుతున్నట్లు తాము పదేపదే చెబుతున్నామని… అందుకు సంబంధించిన సాక్ష్యాలు పలుమార్లు ఇచ్చామని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రావిష్‌ కుమార్‌ తెలిపారు.

పాక్‌ టెర్రరిజం అణచివేతపై ద్వంద విధానాలు అవలంబిస్తుందని తీవ్ర విమర్శలు చేశారు. ఓ వైపు చర్యలు చేపట్టామని చెబుతూనే మరోవైపు ఉగ్రవాదులు లేరని అసత్య సమాచారం చేరవేస్తుందని అన్నారు. పాక్‌ ఉగ్రవాదులపై తీసుకుంటున్న చర్యలను అంతర్జాతీయ సమాజం పరిశీలిస్తుందని , నామమాత్రపు చర్యలతో భారత్‌ను మోసం చేయలేరని ఆయన అన్నారు. టెర్రరిస్టు గ్రూపులపై పాకిస్థాన్‌ చిత్తశుధ్దితో తీసుకునే చర్యలపైనే పాక్‌ యొక్క భవితవ్యం ఆధారపడి ఉంటుందని రావిష్ స్పష్టం చేశారు.

Related posts