telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీ విద్యార్థులకు సిలబస్ కుదింపు!

exam hall

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ సిలబస్ కుదింపు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైరస్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలు రద్దు చేశారు. ప్రతిసారి ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఉండేది. కరోనా కారణంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కాలేదు. దీంతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

ఈ నేపథ్యంలో, ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆగస్ట్ 3 నుంచి వచ్చే ఏడాది మే రెండో వారం వరకు క్లాసులను నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో సిలబస్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. 2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్ సిద్ధం చేస్తున్నారు. మే రెండో వారం నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు.

Related posts