telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో వింత…ఒంటికన్నుతో మేకపిల్ల జననం

గతంలో రెండు తలల దూడ, ఆవు కడుపులో పంది జన్మించడం ఇలా మనం గతంలో ఎన్నడూ చూడని వింతలు ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. అయితే.. తాజాగా కృష్ణా జిల్లా వీరులపాడు మండలం నరసింహారావు పాలెం లో వేముల సాంబయ్య రైతు దగ్గర ఒంటికన్ను మేకపిల్ల ముక్కు లేకుండా జన్మించింది. దీనిని పరిశీలించగా కన్ను, ముక్కు, నోరు ఒక పక్కకు నాలుక బయట పెట్ట రావడం జరిగింది. దీన్ని చూసి రైతు ఆశ్చర్యానికి గురయ్యాడు. పైపులతో మేకపిల్ల పాలు పడుతుందని.. ఎలాగైనా దీన్ని బ్రతికిస్తాను అని ధైర్యంగా చెబుతున్నాడు ఆ రైతు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఈ వింతను చూసి తండోపతండాలుగా తరలివస్తున్నారు. సమీపంలో ఉన్న పశు వైద్యులు సంప్రదించగా ఇది జన్యు లోపం అని పశువైద్య అధికారి విజయ్ యశ్వంత్ తెలియజేశారు.

Related posts