telugu navyamedia
నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు

లోక్ సభ స్పీకర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపొందారు.

18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తోడ్కొని వెళ్లారు. స్పీకర్ చైర్ లో కూర్చుని వరుసగా రెండోసారి ఆయన బాధ్యతలు చేపట్టారు.

రాజస్థాన్ లోని కోటా లోక్ సభ నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ఎంపీగా ఎన్నికయ్యారు.

వరుసగా అక్కడి నుంచే మూడోసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. 17వ లోక్ సభ స్పీకర్ గా సేవలందించారు.

స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు.

Related posts