telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ మాతృభాషా సుందరీ!”

Oh matrubasha sundari poetry corner
నడకలో తెలుగు పదాల
 వయ్యారం-
పలుకు లో  వీణా తంత్రి 
మృదు స్వన విన్యాసం-
చేతల్లో సంపూర్ణ ఆదరాభిమానం-
రాతల్లో మాతృభాషా 
సాహిత్య ప్రవాహం
ఓ మాతృ భాషా సుందరీ!
యాభై యారక్షరాల  పుష్ప మంజరీ!
నీకై- బుద్ధి జీవి పరవశం –
నీతోనే సాధ్యపడును
ఘన యశం-
అహరహం
వలపును కురిపిస్తూ-
లాలిస్తూ బుజ్జగిస్తూ
నీలో   “అ” “ఆ” ల
యాబది యారక్షరాల
సంపూర్ణతను
సాధించాలని తపిస్తూ-
అమరమైన తెలుగు భాషా
 కడలిలో
 ప్రణయోర్మిలో సంచారం-
తెలుగు నీవై
వెలుగు నీవై
 కలకాలం చిన్ముద్ర వై
  నాతోనే ఉండిపో 
నాశ్వాసలోనే నిండిపో
-అంశమాలి, టెక్కలి.

Related posts