telugu navyamedia
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ అప్డేట్ : కొమురం భీం కోసం ఎన్టీఆర్ కసరత్తులు

Jr.ntr actor Ycp photos social media

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశమే ఈ చిత్ర‌మని ఇది వ‌ర‌కే రాజ‌మౌళి తెలియ‌జేశారు. ఇటీవ‌ల చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌డంతో కొద్ది రోజుల పాటు చిత్రీక‌ర‌ణ‌కి బ్రేక్ ఇచ్చిన టీం రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇక కొమురం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. లాయిడ్ స్టీవెన్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన్నాళ్లుగా వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. తాజాగా లాయిడ్‌ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్ లెగ్‌కి సంబంధించిన ఫోటోల‌ని షేర్ చేశాడు. ఈ ఫోటోకి కొమురం భీం, ఆర్‌ఆర్‌ఆర్‌ హ్యాష్‌ ట్యాగ్‌లతో ఎన్టీఆర్, రాజమౌళిలను ట్యాగ్ చేశాడు లాయిడ్‌. దీనికి ఎంతో కృషి చేశాం అని కామెంట్ కూడా పెట్టాడు. లాయిడ్ షేర్ చేసిన ఫోటో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. జూలై 30, 2020న చిత్రం విడుద‌ల కానుంది.

NTR

Related posts