telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎన్టీఆర్ శ‌త జయంతి : ఎన్టీఆర్ ఘాట్‌లో టీఆర్ఎస్ నేత‌లు నివాళులు

స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద టీఆర్ఎస్ నేత‌లు ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు… నివాళులర్పించారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో గులాబీ నేతలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు నివాళులర్పించినవారిలో మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు ఉన్నారు. 

KCR to sack Minister Malla Reddy from cabinet!

ఒక తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. భారతరత్న కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారని తెలిపారు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు తారాస్థాయిలో అభిమానులున్నారు. ప్రధానిమంత్రి అవ్వాల్సిన ఎన్టీఆర్‌… జస్ట్‌లో మిస్ అయ్యారన్నారు. ఎన్టీఆర్ బాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ నడుస్తున్నారన్నారని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Telangana: Motkupalli Narasimhulu set to join TRS soon

సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఉంటారని టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ మాదిరి కేసీఆర్ కూడా మంచి పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని తీసుకుని కేసీఆర్ నడుస్తున్నారని అన్నారు. ‘‘నా దగ్గరకు అర్థ రూపాయ లేకపోయునా.. నాకు పెళ్లి చేసి… తనని మంత్రి చేసి ముందు ఉండి నడిపిన గొప్ప మనసున్న వ్యక్తి ఎన్టీఆర్ అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కి భారతరత్న ఇవ్వాల్సిందే : నామా

స్వర్గీయ ఎన్టీఆర్‌లకు భారతరత్న కోసం పార్లమెంట్ సమావేశాల్లో పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌‌కి భారత రత్న ఇవ్వాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టమని తెలిపారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొనియాడారు.

Related posts