దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కొద్దిరోజుల కిందటే వెలువడింది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నాను ఎంపిక చేశారని ప్రచారం సాగుతోంది.ఈ సినిమా షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలుకానుండగా.. త్రివిక్రమ్ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించబోతున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మిక స్థానంలో సమంతా అక్కినేనిని హీరోయిన్‌గా చిత్ర యూనిట్ తీసుకోనున్నారని తెలుస్తోంది. రష్మిక తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె పేరే వినిపించినా.. సడన్‌గా సమంతా పేరు తెరపైకి వచ్చింది.త్రివిక్రమ్ గత చిత్రాలైన ‘అత్తారింటికి దారేది’, ‘సన్ అఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ వంటి చిత్రాల్లో సమంతా నటించిన విషయం విదితమే. అయితే ఈ చిత్రం కోసం సమంతాను ఎంపిక చేశారన్న వార్తపై ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటికి రాలేదు. కాగా, పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.
previous post
next post