telugu navyamedia
రాశి ఫలాలు

న‌వంబ‌ర్ 7, ఆదివారం రాశిఫ‌లాలు..

మేషరాశి..

వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ధనవ్యయం క‌లుగుతుంది. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో మాటపట్టింపులు ఎక్కువ‌వుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభరాశి..

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి మెరుగుప‌డుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునరాశి..

దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. చిన్ననాటి మిత్రుల క‌లుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గంటారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కర్కాటకరాశి..

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతోంది. కొత్త‌గా అప్ప‌లు చేస్తారు. విద్యార్థులకు నిరుత్సాహం క‌లుగుతుంది.. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు ఎక్కువవుతాయి. ఆలయ దర్శనాలు చేస్తారుఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసిరావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి..

సింహరాశి..

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం ఎక్కువ‌వుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఏదుర‌వుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కన్యరాశి..

రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఇంటాబయటా అనుకూలత ఉంటుంది. విచిత్రమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

తులరాశి..

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల వల్ల మాటవపడతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ క‌లుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు..

వృశ్చికరాశి..

ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తిని ఇస్తాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం ఏర్ప‌డ‌తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపార విషయంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి.

ధనుస్సురాశి..

రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని ముఖ్య‌మైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు నెల‌కొంటాయి. ఆధ్యాత్మిక చింతన క‌లుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మకరరాశి..

స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి. పనుల్లో విజయం సాధిస్తున్నారు. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వృవృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశములు పొందుతారు..\

కుంభరాశి..

నూతన ఉద్యోగయోగం. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండు,పూలు, చల్లని పానియ వ్యాపారులకు క‌లిసివ‌స్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమకు త‌గిన‌ ఫలిస్తుంది. వాహనయోగం కలుగుతుంది. దైవ‌ కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనరాశి..

కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు విలువైన బంగారు వస్తువులపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అనారోగ్యం భారిన ప‌డ‌తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి.

Related posts