కరోనా నేపథ్యంలో..విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సిలబస్ తగ్గిస్తుందని అందరు భావించారు. కానీ సిలబస్ తగ్గిపునకు బ్రేక్ పడేలా ఉంది. తాజాగా..ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఏ తరగతికీ సిలబస్ తగ్గించకూడదని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. పనిదినాలు తగ్గినందున సిలబస్ కూడా తగ్గిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెల రోజుల క్రితం స్పష్టంచేశారు. కరోనా పరిస్థితులపై సమీక్షించిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రస్తుతానికి 30 శాతం తగ్గించాలని సూచించింది. ఆ ప్రకారం సీబీఎస్‌ఈ 9-12 తరగతులకు మూడు నెలల క్రితమే 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించింది. మిగిలిన తరగతులకు సిలబస్‌ను ఆయా పాఠశాలలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ఏ అంశాలను తొలగించాలో ఎస్‌సీఈఆర్‌టీ పాఠశాల విద్యాశాఖకు సూచించింది. సీబీఎస్‌ఈ మాదిరిగానే ఇక్కడా 30 శాతం సిలబస్ తగ్గిస్తారని అందరూ భావించారు.అందుకు భిన్నంగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
previous post
next post
జగన్ ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు: చంద్రబాబు