telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

గణతంత్ర వేడుకలకు సర్పంచ్‌లను ఆహ్వానించరాదు: ఈసీ

telangana assembly poling in done
తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు  సర్పంచ్‌, ఉపసర్పంచ్‌లను ఆహ్వానించరాదని సూచించింది. ఈ నెల 21న తొలి విడత పంచాయతీ  ఎన్నికలు జరుగగా, రెండో విడత 25న, మూడో విడత ఎన్నికలు 30న జరుగనున్నాయి. 
మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాక గెలుపొందిన వారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కమిషన్‌ పేర్కొంది. అప్పటి వరకు వారిని ఎలాంటి అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించరాదని తెలిపింది. పంచాయతీ ప్రత్యేక అధికారులే జాతీయ జెండా ఆవిష్కరించాలని ఆదేశించింది. ఈవిషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది.

Related posts