telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కోమాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్…!

Kim

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక, సైనిక రంగంలోనూ జోంగ్‌కు కొన్ని అధికారాలను కట్టబెట్టినట్టుగా దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో చాంగ్‌ సాంగ్‌ మిన్‌ మాట్లాడుతూ..‘కిమ్ కోమాలో ఉన్నట్టు నేను అంచనా వేస్తున్నాను. కానీ అతను మరణించలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది కిమ్ బయట కనిపించింది చాలా తక్కువని, ఆయన ఆరోగ్యం క్షిణించిందని చాంగ్ తెలిపారు. ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందకు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ సిద్దంగా ఉన్నారని చాంగ్ అన్నారు. ఈ విషయాన్ని తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయని గతంలో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే-జంగ్‌కు సహాయకుడిగా పని చేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి ఉన్న కొన్ని అధికారాలను కిమ్‌ తన సోదరి కిమ్‌ యో జోంగ్కు కట్టబెట్టారని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts