telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సాగర్‌ ఉప ఎన్నికల్లో ట్విస్ట్‌… టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కీలక నేత !

తెలంగాణలో ఇటీవలే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ భారీ విజయాన్ని సాధించింది. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రావడంతోనే.. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికపై ఫోకస్‌ పెట్టాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జానారెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక ఇప్పటికే అన్ని పార్టీలు ఆ నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలు పెట్టేశాయి. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డిని ఢీకొనే అభ్యర్థి ఎవరనే విషయంలో అధికార టీఆర్‌ఎస్‌ సర్వేలపై సర్వేలు చేయించినా అభ్యర్ది ఎంపిక విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే.. తాజాగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. నోముల భగత్ నే సాగర్‌ ఉప ఎన్నికల అభ్యర్థి అని తెలుస్తోంది. దీనిపై మరి కాసేపట్లో ప్రకటన రానుంది. అంతేకాదు… సీఎం కెసిఆర్ ను కలిసి బీఫాం తీసుకోనున్నారు భగత్. రేపు ఉదయం భగత్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే… నాగార్జున సాగర్ అభ్యర్థిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్న కమలం పార్టీ…టీఆర్‌ఎస్‌ నుంచి ఒక నేత వస్తాడని ఎదురు చూస్తున్నట్టు సమాచారం అందుతోంది. మధ్యాహ్నం వరకు అభ్యర్థి అంశంపై క్లారిటీ రానుంది. అటు సీటును పలువురు బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. ఆలస్యం చేయడం బీజేపీకి నష్టం అనే అభిప్రాయంతో పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Related posts