no work permit for indians in maldivs

మొన్న అమెరికా…నేడు మాల్దీవులా…వివక్షా లేక రాజకీయమా…?

78

మొన్న మొన్నటి వరకు ట్రంప్ ప్రభుత్వం వీసాపై అనేక ఆంక్షలు విధిస్తామని ఇక దేశంలో ఉద్యోగాలు ప్రాంతీయతకే కాని పరాయివారికి కాదన్నట్టు చేశారు. కానీ ఎంతోమంది విదేశీయులు శ్వేతసౌధం ముందు కుటుంబాలతో సహా ఆందోళన చేపట్టే సరికే కాస్త సమాలోచన చేసి వీసాపై ఎటువంటి కొత్త నిబంధనలు లేవని, కానీ గ్రీన్ కార్డు అయితే ఇక మీదట పొందటం అంత సులభం కాదని మాత్రం స్పష్టమైంది. ఇప్పటికే ఉన్నవారిలో 90 శాతం మంది భారతీయులు అవటం వారంతా గ్రీన్ కార్డు కోసం ఎదురు చూడటంతో ఆ దేశంలోనే ఉండిపోయే హక్కు అనే గ్రీన్ కార్డు మాత్రం జారీ చేయబోమనే సంకేతాలు మాత్రం ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం.

ఇది ఇలా ఉంచితే కొత్తగా మాల్దీవులలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. అక్కడి అధ్యక్షుడు భారతీయులకు ఇప్పుడప్పుడే వర్క్ పర్మిట్ జారీ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అక్కడ పని చేసుకుంటూ చదువుకునే వారికి కూడా సమయం ఇవ్వకుండా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు తాము ఉద్యోగం చేస్తున్నాం కదా అని తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చాలని వాపోతున్నారు.

ఇప్పటికే అక్కడ భారతీయులు చాలామంది విద్యాబ్యాసం కోసం వెళ్లి చదువుకుంటూనే మరో పక్క ఉద్యోగం చేసుకుంటున్నారు. వీరికి జులై 1 వరకు మాత్రమే అవకాశం ఉందని ఆ తరువాత వెళ్లిపోవాలని అక్కడి యాజమాన్యం చెప్పేసిందట. ఇక దీనిపై పోరాటం చేయాలో, ప్రభుత్వాన్ని బ్రతిమాలలో అంటూ జులై 1 లోగా తమ సమస్యను పరిష్కరించుకునేందుకు అక్కడివారంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

భారతీయులపైనే ఈ విధమైన వివక్ష కొనసాగుతుందా…లేక మరేమైనా ఉందా…అనేకోణంలో ఆలోచించాల్సిన విషయమే ఇది. కానీ వాళ్ల వైపు నుండి కూడా ఆలోచిస్తే అక్కడ మనవాళ్ళు కూడా అవకాశం దొరుకుతుందని తందోపతండాలుగా వెళ్లి అక్కడ వారికి అవకాశాలు లేకుండా చేయటం కూడా సబబు కాదేమో…అనేది కూడా ఒక ముఖ్య చర్చనీయాంశమే. మన దేశంలోనే ఒక రాష్ట్రం వాడు వేరే రాష్ట్రంలో ఉద్యోగానికి వెళితే … ప్రాంతీయత అని నొక్కి వక్కానిస్తున్నాం…మరి వేరే దేశమే వెళ్లి మమ్మలి ఉండనివ్వండి అని అడుక్కోవటం ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన విషయం. ఆ అడుక్కునేదేదో దేశంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించి కావలసింది చేయించుకోవాలి కానీ ఎక్కడికో వెళ్లి మా గురించి ఆలోచించండి అని అడగటం ఎంత వరకు సమంజసమో ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన విషయం. జన్మభూమికంటే పరాయి ప్రాంగణం అందంగా ఉండనటం నిన్ను నువ్వు కించపరచుకోవటమే నని గుర్తుపెట్టుకో!