no strike at tsrtc

రైటు ..రైటు ..ఆగిన ఆర్టీసీ సమ్మె

18

తెలంగాణా ఆర్టీసీలో సమ్మె సైరన్ ఎట్టకేలకు ఆగిపోయింది. ఇటు కార్మిక సంఘాలు అటు మంత్రుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా 25 శాతం ఐఆర్‌ ఇవ్వాలని పట్టుబట్టగా 16 శాతం ఇస్తామని మంత్రివర్గం ప్రకటించింది. ఆర్టీసీలో పలు సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు, సోమవారం నుంచి ఎప్పటిలాగే బస్సులు నడిపిస్తామని టీఎంయూ నాయకులు ప్రకటించారు.

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని టీఎంయూతో పాటు ఐకాస నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమ్మె చేస్తే ఆర్టీసీ మూసేస్తామని, తెలంగాణా చరిత్రలో ఇదే ఆఖరి సమ్మె అవుతందని హెచ్చరించారు. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణా రాష్ట్రంలోనే అధిక వేతనాలు చెల్లిస్తున్నామని, వేతన సవరణ చేస్తే 1400 కోట్ల మేర ప్రభుత్వం పై అదనపు భారం పడుతుందని తేల్చి చెప్పడంతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తామంటూ స్పష్టం చేశారు.

ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం ఆదివారం ఉదయం నుంచి సాయత్రం వరకు కార్మిక సంఘాల నాయకులతో ప్రధాన డిమాండ్లపై చర్చించారు. ఐఆర్‌ (మధ్యంతర భృతి) జులై నెల నుండి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక సకలజనుల సమ్మె కాలంలో 26 రోజుల పాటు చేసిన సమ్మె కాలానికి వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం ఆదివారం ఉదయం నుంచి సాయత్రం వరకు కార్మిక సంఘాల నాయకులతో ప్రధాన డిమాండ్లపై జరిపిన చర్చలు ఫలించడంతో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించారు.