telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్ లో .. నో సెల్ఫీ జోన్లు.. అధిగమిస్తే జైలుకే..

no selfi zones in hyderabad

ఇటీవల యువతకు సెల్ఫీ పిచ్చి పట్టేసింది. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి. మన్నూ మిన్నూ కానకుండా ప్రమాదకరమైన ప్లేస్‌ల్లో కూడా సెల్ఫీల కోసం ఎగబడుతూ.. ఈతరం యువత ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. మన భాగ్యనగరం యువత ధోరణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేస్ ఏదైనా.. అది రద్దీగా ఉన్నా.. ప్రమాదకరమైనది అయినా.. సెల్ఫీలు దిగడానికి ఎగబడుతున్నారు. ఆ సెల్ఫీ కాస్తా కిల్ఫీగా మారుతుండటంతో.. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలను నియంత్రించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. భాగ్యనగరం మొత్తానికి 50 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్లు’గా గుర్తించినట్లు సమాచారం. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రదేశాలు, వాటర్ ప్లేస్‌లు, కొండలు, గుట్టలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇకపోతే కీసర గుట్ట, ఘట్ కేసరి, గండిపేట చెరువు, బయోడైవర్సిటీ ప్లై ఓవర్, రైల్వే స్టేషన్ల లాంటి దాదాపు 10 ప్రాంతాలు సైబరాబాద్ ఏరియాలోనే ఉండటం గమనార్హం.

Related posts