telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

హైదరాబాద్ వినాయక ఉత్సవాలు : .. ఫ్లెక్సీలు వద్దు .. మట్టిగణేశుడే ముద్దు..

no reflexes in ganesh utsav slogan

రాబోయే వినాయక ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల్లో పర్యావరణ హితం కోరేవారెవరూ కూడా ప్లాస్టిక్‌ను నిషేధించడంతో పాటుగా ఎవ్వరూ కూడా ఫ్లెక్సీలను వాడరాదని ఎల్బీనగర్ జోన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సమిష్టిగా తీర్మానం చేశారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో వినాయక ఉత్సవాలపై ముందస్తుగా అన్ని శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ సమితి ప్రతినిధులు కూడా ఉత్సవాల్లో ఫ్లెక్సీలు వాడరాదంటూ పిలుపునివ్వాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతన శశిధర్, కార్పొరేటర్లు భవానిప్రవీణ్‌కుమార్, కొప్పుల విఠల్‌రెడ్డి, ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌తోపాటుగా ఉపకమిషనర్లతో పాటుగా విద్యుత్, హెచ్‌ఎంఆర్, జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో జలమండలి వారు అందించే నీటిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో కాకుండా గ్లాసుల్లో అందించాలని, అదేరీతిలో ఎవ్వరూ కూడా ఫ్లెక్సీలు వాడకుండా పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకారం అందించాలని తీర్మానించారు.

Related posts