telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య సినిమాకు చిక్కులు… ?

Surya

ప్రముఖ తమిళ హీరో సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరరై పొట్రు’. తెలుగులో ఈ సినిమాకి ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మగల్ వందాల్’ అనే తమిళ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసాడు హీరో సూర్య. కానీ అప్పటికే తమిళ థియేటర్ల సంఘాలు సూర్య పై పైర్ అయ్యాయన్న విషయం తెలిసిందే. థియేటర్లు తెరుచుకునే వరకూ విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయకూడదని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ వారి మాట కాదని రిలీజ్ చేస్తే సూర్య హీరోగా చేసే సినిమాలన్నింటిపై నిషేధం విధిస్తామని హెచ్చరించారు. సూర్య సినిమాలే కాకుండా నిర్మాతగా వ్యవహరించే సినిమాలు థియేటర్లలో ఆడకుండా చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న “ఆకాశమే నీ హద్దురా” సినిమా కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts