రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ల్లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా జట్టుకట్టాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను ఆప్ తిరస్కరించింది. శుక్రవారం ఆప్ నేత గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఆప్‌తో పొత్తును వ్యతిరేకిస్తూ ఇటీవల పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలాదీక్షిత్ ప్రకటనలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని, కానీ ఆ ప్రయత్నంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేది లేదని గోపాల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి గతంలో ప్రయత్నించామని తెలిపారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అలాంటి ప్రయత్నం చేయబోమని తేల్చిచెప్పారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ పార్టీకి మంచిపట్టుందని, పార్టీ బలం పెంచుకునేందుకు ఒంటరిగా పోటీచేస్తామని తెలిపారు. త్వరలోనే అభ్యర్థులను కూడా ప్రకటిస్తామన్నారు.
ఎన్నికలు అయి పోగానే ఉత్తమ్ పీసీసీ పోస్ట్ ఉడిపోతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వర్రెడ్డి