telugu navyamedia
సినిమా వార్తలు

అప్ప‌డే క‌నెక్ట్ అయిపోయా..!

రెండేళ్ల క్రితం ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిపోయాను అంటుంది న‌టి నివేద పేతురాజ్‌.. ప్రేమలో ఉన్నవారందరూ కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారని,.కొన్ని సన్నివేశాలు వింటున్నప్పుడే కంటతడి పెట్టించేశాయి. దీంతో వెంటనే చేస్తానని చెప్పా. ప్రేమించినప్పుడు కొంత మంది పిచ్చోళ్లలా ఆలోచిస్తుంటారు కదా. అలాంటి ఓ కుర్రాడి ప్రేమకథతోనే ఈ చిత్రం తెరకెక్కించారు. సినిమా చూశాక.. ఇలాంటి స్క్రిప్ట్‌ రాయడానికి దర్శకుడెంత పాగల్‌లా.. ఫ్యాషన్‌తో ఆలోచించి ఉంటాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది’’

Nivetha Pethuraj: I have always wanted to do that .. Nivetha reveals the  key - nivetha pethuraj wants to direct movie very soon

నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే ఏ అంచనాలూ ఉండవు. ‘పాగల్‌’ చేస్తున్నప్పుడు మంచి సినిమా, మంచి పాత్ర చేస్తున్నాననే ఫీల్‌ కలిగింది’’ అన్నారు నివేదా . విశ్వక్‌ సేన్, నివేదా పేతురాజ్‌ జంటగా ‘దిల్‌’ రాజు – బెక్కెం వేణుగోపాల్‌ నిర్మాణంలో వస్తోన్న చిత్రం ‘పాగల్‌’. నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలతోంది.

 

రెండేళ్ల క్రితం నరేశ్‌గారు ఈ సినిమా కథ చెప్పారు. వింటున్నప్పుడే బాగా నచ్చేసి ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. కథ విన్న ప్రతిసారీ కన్నీళ్లు పెట్టుకున్నాను. నరేశ్‌గారు కథ చెప్పినప్పుడల్లా బెక్కెం వేణుగోపాల్‌గారు కూడా ఉన్నారు.నేనిందులో తీర అనే అమ్మాయిగా కనిపిస్తా. విష్వక్‌ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు.

Nivetha Pethuraj Wiki, Biography, Age, Husband, Movies, Images & More - News Bugz

ఇందులో మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ‘సఖి’ చిత్రంలో మాధవన్‌, షాలిని మధ్య ఎలాంటి ఎమోషన్స్‌ ఉంటాయో.. ఇందులో మా మధ్య అలాంటి ఎమోషన్సే కనిపిస్తాయి’’.రేసింగ్‌ ట్రైనింగ్‌ అప్పుడే కొత్త సినిమాలు కమిట్‌ అయ్యాను అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంద‌న‌మాట‌.

Related posts