telugu navyamedia
రాజకీయ

బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా..

*బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
*గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి రాజీనామాను స‌మ‌ర్పించిన నితీష్‌
*బీహార్ లో రాష్ర్ట‌ప‌తి పాల‌న విధించాలి..
*ర‌బ్రీదేవీ నివాసానికి చేరుకున్న నితీష్‌
*ప్ర‌భుత్వ ఏర్పాటుపై తేజస్వీ యాదవ్ చ‌ర్య‌లు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌కు ఒంటరిగా వచ్చిన ఆయన గవర్నర్‌ ఫగూ చౌహాన్‌ కలిసి త‌న‌ రాజీనామా లేఖ అందించారు.

గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్డీయే నుంచి వైదొలగాలని ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరిలో ఏకాభిప్రాయం ఉందన్నారు. తనకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు.

అంతకుముందు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము నితీశ్ కుమార్ వెంటే ఉంటామని.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జేడీయూ ఎంపీలు , ఎమ్మెల్యేలతో సమావేశం తరువాత రాజీనామా నిర్ణయం తీసుకున్నారు నితీష్‌కుమార్‌.

మరోవైపు.. బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్‌.. బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.బీజేపీ ఎప్పుడూ అవమానానికి గురిచేస్తోందని.. జేడీయూను అంతమొందించేందుకు కుట్ర పన్నిందని అన్నారు. 2020 నుంచి ప్రస్తుత కూటమి తనను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని సీఎంకు స్పష్టం చేశారు.

ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకపోతే పార్టీకి మేలు జరగదని ఆ కూట‌మికి ఇవాళ గుడ్‌బై చెప్పేశారు నితీశ్‌. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

Related posts