telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్!

Nithin Gadkari

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.

అనారోగ్యంగా ఉండడంతో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని మంత్రి పేర్కొన్నారు.తనకు కొంత అనారోగ్యంగా ఉండడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Related posts