యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుసగా సినిమాల కు తెరలేపాడు. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది షూటింగ్ దశలో ఉండగానే తన తర్వాతి సినిమాను నితిన్ ప్రకటించాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు నితిన్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయన్లుగా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. `నా 28వ సినిమాకి ముహూర్తం పూర్తయింది. చంద్రశేఖర్ యేలేటిగారితోతో కలిసి పనిచేయబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎట్టకేలకు రకుల్‌తో కలిసి పనిచేయబోతున్నాను. ప్రియా ప్రకాశ్ వారియర్ మరో హీరోయిన్‌గా కనిపించబోతోంది. భవ్య ఆనందప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నార`ని నితిన్ ట్వీట్ చేశాడు.