telugu navyamedia
రాజకీయ వార్తలు

పేదలకు మేలు చేసేలా భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల దేశంలోని పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రత్యక్ష నగదు బదలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని తెలిపారు. పేదవారిలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండే పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోన్న ప్యాకేజీతో దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు లాభం చేకూరుతుందని చెప్పారు. రానున్న మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

Related posts