telugu navyamedia
రాజకీయ వార్తలు

ఒకే పన్ను విధానంతో సత్ఫలితాలు: నిర్మలా సీతారామన్‌

Nirmala sitaraman budget

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంతో అమల్లోకి తెచ్చిన జీఎస్‌టీ వల్ల సామాన్యులకు ఎంతో మేలు జరిగిందని తెలిపారు. ముఖ్యంగా శ్లాబుల తగ్గింపు తర్వాత వారి నెలవారీ ఖర్చుల్లో నాలుగు శాతం మేరకు ఆదా చేసుకోగలిగారని తెలిపారు.

సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు ఎంతో మేలు జరిగిందని చెప్పారుఅదే సమయంలో అన్ని వర్గాల చెల్లింపుదారులు లక్ష కోట్లు ఆదా చేసుకోగలిగారని వివరించారు. ట్రాన్స్‌పోర్టు, లాజిస్టిక్‌ రంగాల్లో జీఎస్‌టీ పనితీరు చాలాబాగుందన్నారు. . ఇప్పటి వరకు నలభై కోట్ల జీఎస్టీ రిటర్న్‌లు దాఖలైనట్లు చెప్పారు. కొత్తగా 16 లక్ష మంది ఆదాయపన్ను పరిధిలోకి వచ్చారన్నారు. జీఎస్‌టీలో సమస్య పరిష్కారానికి జీఎస్‌టీ మండలి వేగంగా పనిచేస్తోందన్నారు.

Related posts