telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు

నిరంతర అధ్యయనమే పరిశోధనలకు మూలం, ప్రొ. వి. వెంకయ్య

నిరంతర అధ్యయనం, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సరికొత్త ఆవిష్కరనలను పరిశోధకులు ఎప్పటికి అప్పుడు పరిశీలించాలని కృష్ణా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ రెక్టర్ ఆచార్య. వి.వెంకయ్య అభిప్రాయపడ్డారు. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ప్రొ. జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో “అకాడెమిక్ పరిశోధన మరియు పరిశోధనకు మద్దతు” అనే అంశంపై నిర్వహించిన మూడు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆచార్య.వెంకయ్య మాట్లాడుతూ పరిశోధకుల్లో చిత్తశుద్ధి, అన్వేషించాలి అనే తపన లేకుంటే కొత్తవాటిని కనిపెట్టడం, సమాజానికి ఉపయోగపడే వాటిని ఆవిష్కరించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

పరిశోధన పత్రాల్లో నాణ్యత లేకుండా పరిశోధన పూర్తి చేసి పీఎచ్.డి. పొందినా ఆ పరిశోధన గ్రంధానికి విలువ ఉండదన్నారు. అంతర్జాతీయ జర్నల్స్ లో పరిశోధన పత్రాలు ప్రచురించినప్పుడే వాటికి ఎక్కువ విలువ ఉంటుందని ఈ దిశగా పరిశోధక విద్యార్ధులు , అధ్యాపకులు పనిచేయాలని సూచించారు .
ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, డైరెక్టర్ ప్రో. సుధారాణి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సు పరిశోధక విద్యార్ధులకు, అధ్యాపకులకు ఉపయోగకారిగా నిలువనుందని వివరించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, డీన్లు, అధ్యాపక, పలు విభాగాల పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts