ah-symptoms-to-nurses-treated-nipah-patients

కేరళ నుండి…రాయలసీమకు…నిఫా…?

100

చిత్తూరు జిల్లా లో నిఫా వైరస్ కలకలం రేపుతుంది. మదనపల్లె కు చెందిన ఒక డాక్టర్ కేరళలో వైరస్ సోకిన ఒకరికి వైద్యం అందించారని, ఇపుడు ఆమెకు కూడా నిఫా లక్షణాలు కనిపించడంతో తిరుపతి రుయా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం పై కేరళ ప్రభుత్వం ఏపీ ని అప్రమత్తం చేసింది. దీనితో వైరస్ లక్షణాలు ఉన్న బాధితురాలని చిత్తూరు జిల్లా ‘డి యమ్ హెచ్ ఓ’ రుయా హాస్పిటల్ లో చూపించారు.

ఇప్పటికే కేరళలో నిఫా వైరస్ వల్ల 20 మందికి పైగా చనిపోయారు. వెంటనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమై వైరస్ సోకినా వారికీ ప్రత్యేక వైద్య సదుపాయం అందించారు. కేరళలోని కాలికట్ లో పనిచేస్తున్నచిత్తూరు జిల్లా కు చెందిన వైద్యురాలు అక్కడ సేవలందించింది. తాను సేవలందించిన రోగి చనిపోవడంతో అప్రమత్తం అయిన కేరళ ప్రభుత్వం సేవలు అందించిన వాళ్లకి ట్రీట్మెంట్ చెయ్యాలని ఉదేశంతో ఒక లేఖ కూడా రాయడం జరిగింది. గత నెల 25 వ తేదీన లేఖను అందరికి పంపారు, దీనితో అప్రమత్తం అయిన ఇతర ప్రభుత్వాలు వాళ్లు వెళ్లిన ఏ చోటైనా సేవలంచించేలా చర్యలు చేపట్టారు.