telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అశ్వథ్థామ‌ : నిన్నే నిన్నే… లిరికల్ వీడియో సాంగ్

Ashwathama

యంగ్ హీరో నాగశౌర్య ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వథ్థామ‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా మెహ్రీన్ నటిస్తోంది.  నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 31న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నాగశౌర్య కథను అందిస్తున్నారు. ఉష మలుపూరి నిర్మిస్తున్నఈ చిత్రం నుంచి ‘నిన్నే నిన్నే’ పాటను విడుదల చేశారు. రమేష్ వకచర్ల లిరిక్స్‌కు శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బాణీలను సమకూర్చారు. అర్మాన్ మాలిక్, యామినీ ఘంటసాల ఆలపించిన ఈ పాట మెలోడీ సాంగ్‌గా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts