telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

★★ నిజమైన ప్రేమ ★★

chalu priya poetry corner
అమ్మ ప్రేమ లోని స్వచ్ఛత..
ఆలి ప్రేమలోని  బాధ్యత ..
అక్కచెల్లెళ్ల ప్రేమలో అనురాగం..
ప్రియురాలి ప్రేమలో లాలన…
కూతురి ప్రేమలో మురిపెం..
అమ్మమ్మ ప్రేమలో ఆప్యాయత..
నానమ్మ ప్రేమలో నాణ్యత …
అత్తమ్మ ప్రేమలో అభిమానం..
మరదలి ప్రేమలో మమకారం..
వదిన ప్రేమలో అధికారం…
ప్రే అంటే ప్రేమించేది  (అమ్మాయి)
మ అంటే మగవాడు (అబ్బాయి) 
ఆదిఅంతం లేని అపురూప సమ్మేళనం ప్రేమ ..
ఆత్మీయతల చిరునామా..
అమ్మలోని కమ్మదనం..
అతివలో చల్లదనం..
కలబోసిన అమృతమే  ప్రేమ ..
అది ఎన్నటికి చెరిగిపోని ధీమా…
దూడపాక శ్రీధర్..
మంథని ,జిల్లా :పెద్దపల్లి 
తెలంగాణ పిన్:505184

Related posts