telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో నైట్ కర్ఫ్యూ… వీటికి మినహాయింపు

కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా కారణంగా ఏపీలో ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుంది. అయితే నైట్ కర్ఫ్యూ నుంచి కొన్నిటికి మినహాయింపు ఇచ్చారు. రాత్రిపూట కర్ఫ్యూ లో భాగంగా అన్ని కార్యాలయాలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు , రెస్టారెంట్లు, హోటళ్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్ లు, ఫార్మసీలు, అత్యవసర సేవలందించే కార్యకలాపాలకు మాత్రమే కర్ఫ్యూ సమయంలో పనిచేస్తాయి అని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన రంగాలకు చెందిన వ్యక్తులు మినహా మిగతా వారందరి రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, అత్యవసర సేవలు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి వచ్చే వ్యక్తుల రాకపోకలకు అనుమతి ఉండనుంది. అత్యవసర సరకు రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర సరకు రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రజా రవాణాతో పాటు ఆటోలు ఇతర వాహనాలు నిర్ణీత కర్ఫ్యూ వేళల వరకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.  కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది

Related posts