telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ కు నిధి అగర్వాల్ ఘాటు రిప్లై

nidhi agarwal counter answer to

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలెబ్రెటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. హీరోయిన్లు తమ హాట్ ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడం ఈ రోజుల్లో సర్వ సాధారణంగా మారిపోయింది. అది వారి ప్రమోషన్‌లో ఒక భాగం. ఈ ఫొటోలపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తుంటారు. అయితే తాజాగా ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్‌పై ఒక నెటిజన్ దారుణ విమర్శ చేశాడు. తాజాగా నిధి అగర్వాల్ తన ట్విటర్ ఖాతాలో ఒక హాట్ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటో చూసిన నరేష్ అనే వ్యక్తి “నీలాంటి వారివల్లే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. దయచేసి ఇలా హాట్ గా కనిపించొద్దు” అని కామెంట్ చేశాడు. ఇటీవల ఓ వైద్యురాలిపై జరిగిన హత్యోదంతం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దానికి, తన హాట్ ఫొటోకు లింక్ చేసి కామెంట్ చేయడంతో నిధికి చిర్రెత్తుకొచ్చింది. “ఈ వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం నన్ను షాక్‌కు గురి చేసింది. నరేష్.. మీ అడ్రెస్ పంపండి. `పింక్` అనే సినిమాను మీకు పంపుతాను.. మీకు చాలా అవసరం” అంటూ కౌంటర్ ఇచ్చింది.

Related posts