telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం..భౌతిక దూరం కోసం సాఫ్ట్ వేర్!

tirumala temple

లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనాలు పునఃప్రారంభం కావడంతో కొండపైకి భక్తుల తాకిడి ఎక్కువైంది. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వెంకన్న క్షేత్రంలో భక్తుల నడుమ భౌతికదూరం నిబంధన అమలు ఎంతో కష్టసాధ్యంగా కనిపిస్తోంది. దీనిని అధిగమించడానికి ఓ సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నారు.

తిరుమల వ్యాప్తంగా ఉన్న కెమెరాలతో భక్తుల కదలికలను అనునిత్యం పర్యవేక్షిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సీసీ కెమెరాల ద్వారా భక్తులు పరస్పరం ఎంతదూరంలో ఉన్నారన్నది కంప్యూటర్ లో నిక్షిప్తం చేసిన ఈ కొత్త సాఫ్ట్ వేర్ గుర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం నిర్దిష్టదూరంలో ఉంటే మానిటరింగ్ స్క్రీన్ పై సదరు వ్యక్తుల కదలికలు గమనిస్తారు తద్వారా వారికి అప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్ వేర్ అభివృద్ధి దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts