telugu navyamedia
రాజకీయ

31మందితో కొలువుదీరిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కేబినేట్‌..

*బీహార్‌లో కొత్త మంత్రుల ప్ర‌మాణ స్వీకారం..
*31మందితో కొలువుదీరిన బీహార్ కేబినేట్‌

బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ త‌న నూత‌న మంత్రివర్గం ఏర్పాటైంది. ఎన్డీఏ కూటమితో తెగదెంపులు చేసుకుని రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలిపి 8వసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌, ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు.

కాగా..డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు కేబినేట్ లో చోటు ఉంటుందా.. ఉండదా అనే చర్చకు తెరదించుతూ.. నితీష్ మంత్రివర్గంలో బెర్తు ఖరారు చేయడంతో.. ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహఘట్ బంధన్ కూటమి ప్రభుత్వంలో 31 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Mahagathbandhan to get BJP Portfolios in Bihar Cabinet; Tej Pratap in the  Fray: Sources | India News

మంగళవారం ఉదయం పాట్నాలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాగు చౌహన్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

మంత్రుల్లో ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, హిందూస్థానీ అవామ్ మోర్చ నుంచి జితిన్‌ రామ్‌ మాంఝీకి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

బీహార్ లో శాసనసభ్యుల సంఖ్య 243 కావడంతో మంత్రి వర్గంలో గరిష్టంగా 36 మంది ఉండొచ్చు. అయితే ప్రస్తుతం సీఎం నితీష్ తో కలిపి 32 మందికి మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. అయితే మరో నలుగురికి మంత్రివర్గంలో చోటు ఖరారైందని.. మరోసారి మంత్రివర్గ విస్తరణలో వీరు ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts