telugu navyamedia
సామాజిక

సిరిసిల్ల సిగలో ఆధునిక విజ్ఞాన గని..

చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. ఎందుకంటే ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులకు సమానం.మంచి పుస్తకం చదవడం అంటే గత శతాబ్దాల అత్యుత్తమ వ్యక్తులతో సంభాషించడం లాంటిది. అలాంటి పుస్తకాలు కొలువై ఉన్న గ్రంథాలయం ఓ దేవాలయం. అత్యాధునిక హంగులతో జిల్లాలో ఒక ప్యాలెస్ ను తలపించేలా నిర్మితమైంది ఒక గ్రంధాలయం.

అంతేకాదండోయ్ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఆశాదీపంగా నిలుస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఓ ఉద్యమకారుడి చొరవతో మంత్రి కేటీఆర్ సహకారంతో అద్భుతంగా నిర్మితమైన,సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి జ్ఞాపకార్థం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి, గ్రంథాలయంలోనే టాస్క్‌ కేంద్రాన్ని నెలకొప్పి,నైపుణ్యాలతోపాటు విజ్ఞానాన్ని పంచుతూ యుువతను విజయతీరాలకు చేర్చుతున్న సిరిసిల్ల సినారె సరస్వతి మందిరం.

అందంగా కనబడే ఈ మూడు అంతస్థుల భవనం ప్యాలెస్ కాదండోయ్ ఇది ఒక పుస్తక నిలయం.మంత్రి కేటి రామారావు చొరవతో ఈ భవనాన్ని మూడు కోట్ల యాభై లక్షల తో ఒక్క సంవత్సరంలోనే పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో ఐకాన్ గా నిలుస్తున్న ఈ భవనం క్రింది అంతస్తులో మూడు రీడింగ్ గదులున్నాయి.మొదటి అంతస్తులో చైర్మన్,కార్యదర్శి రూములతోపాటు విశాలమైన సమావేశ మందిరం,టాస్క్ శిక్షణ సంస్థ క్లాసురూములు,ఆఫీసును ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల కోసం గదులు,కంప్యూటర్ శిక్షణ కొరకు ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితుడైన ఉద్యమకారుడు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరీ శంకరయ్య ప్రత్యేక కృషితో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మహా మేధావి రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా నిర్మించాలన్నా శంకరయ్య కల నెరవేరింది.

పోటీ పరీక్షల సన్నద్ధతకే కాకుండా ఉపాధి అవసరాల నైపుణ్యాలను అందిస్తున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని సినారె స్మారక మందిరం. ఫ్రెంచ్ నిర్మాణ శైలిలో అత్యాధునిక టెక్నాలజీతో మూడున్నర కోట్లతో నిర్మించిన సినారె మందిరం సిరిసిల్ల పట్టణానికే కొత్తదనాన్ని తీసుకువచ్చింది..సి.నారాయణ రెడ్డి స్మారకంగా ఏర్పాటు చేయబడిన ఈ మందిరం ఇప్పుడు ఎంతో మంది విద్యార్థుల భవితకు బావుటా గా నిలుస్తోంది.

జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ పచ్చని చెట్లుతో నిత్యం విద్యార్థుల రాకపోకలతో కలకళలాడుతుంది..స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ సహకారంతో సినారె మందిరంలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశారు..టాస్క్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం శిక్షణ సైతం ఇస్తున్నారు..25 కంప్యూటర్ లు 40 వేల పుస్తకాలు సమకూర్చారు.. పర్యవేక్షణకులను ఏర్పాటు చేయడం ద్వారా యువత ఉపాధి మార్గాల అవసరాలు తీరనున్నాయి.

డిజిటల్ లైబ్రరీ కూడా కావడంలో స్థానికంగా వివిధ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి ఇక్కడ శిక్షణ అందుతుంది..రోజుకు నాలుగు వందలకు పైగా విద్యార్థులు సినారె మందిరానికి వస్తున్నారు..బ్యాంకు జాబ్స్,ఇతర రంగాల జాబ్స్ కోసం చూసే వారికి నాలెడ్జ్ హబ్ గా కూడా జిల్లా గ్రంధాలయం నిలుస్తోంది..

విద్యార్థులు పోటీ పరీక్షలకు గాను ప్రవేటు శిక్షణ పొందాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి ఫీజు లేకుండా యువత కు శిక్షణ అందిస్తున్నది. సినారె మందిరం..ఒక్కో బ్యాచ్ లో 40 నుండి 50 మంది విద్యార్థులతో ట్రైనింగ్ సాగుతోంది.

టాస్క్ ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని స్థానిక యువత తెలుపుతున్నారు..సినారె మందిరంగా జిల్లా కేంద్రంలో ఉన్న ఈ గ్రంధాలయం వలన స్థానిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఉద్యోగ నైపుణ్యాలతో పాటు విజ్ఞానాన్ని సైతం పొందేలా యువతరానికి ఉపయోగపడుటుంది సినారె మందిరం.దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రావడానికి ఇబ్బందులు ఎదురుకుంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ స్పందించి హాస్టల్ వసతి గృహాన్ని కల్పిస్తే పట్టణానికి దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని,వారు కూడా శిక్షణ పొంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అంటున్నారు.

Related posts