telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

తీహార్‌ జైలు నుంచి రిమాండ్‌ ఖైదీల విడుదల

Thihar jail delhi

కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఢిల్లీ జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని తీహార్‌ జైలు నుంచి మొత్తం మూడువేల మందిని విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతగా శిక్ష అనుభవిస్తున్న   419 మంది రిమాండ్‌లో ఉన్న ఖైదీలను విడుదల చేసింది.

వీరిలో 356 మందికి 45 రోజులపాటు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అలాగే మరో 63 మందికి ఎనిమిది వారాల అత్యవసర పెరోల్‌ మంజూరు చేసింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 71 జైళ్ల నుంచి 11 వేల మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది.

Related posts