telugu navyamedia
సినిమా వార్తలు

నిహారిక ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందా ?… మెగా డాటర్ పై ట్రోలింగ్

Niharika

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఇప్పటికే మూడు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఎలాంటి గ్లామర్ షో చేయలేదు ఈ బ్యూటీ. అయితే ఇప్పటి వరకూ నిహారికకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. తాజాగా వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటో షేర్ చేసింది నీహారిక. ఆమె తల్లి స్వయంగా ఆ ఫోటో తీసారట. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “బీచ్ లో సరదాగా గడిపిన రోజు కంటే బెస్ట్ మరొకటి లేదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో నీహారిక లాంగ్ షర్ట్ , షార్ట్ ధరించింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. “ప్యాంట్ మర్చిపోయావా.. నీహారిక” అంటూ ప్రశ్నిస్తున్నారు. “మీరు మెగా ఫ్యామిలీలో పుట్టారు.. కొంచెం గౌరవంగా ఉండడం నేర్చుకోండి… దయచేసి స్కిన్ షో చెయ్యొద్దు…” రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతోంది.

 

View this post on Instagram

 

Nothing like a good beach day! 😍 . 📸 Amma😘

A post shared by Niharika Konidela (@niharikakonidela) on

Related posts