telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

*** నేను నా బ్రతుకు ***

brathuku chitram poetry corner
పొద్దుందాకా కష్టంజేసి
పొద్దుగూకి ఇంటికస్తే…
కాళ్ళకు నీళ్లఅందిచ్చే 
కరుణలేని నా వాళ్ళు..
కుక్కకు బువ్వేసినట్టు
కంచంలోన కూడెట్టి…
టీవీ ముందు కూకుంటది 
కట్టుకున్నది…
సెల్లు పోను చేత వట్టి 
చెవిలో రెండు తీగలెట్టి
పిచ్చి పిచ్చిగా మాట్లాడతది
చిట్టి తల్లిది..
ఒళ్ళంతా పులిసిపోగా
మనసులోన బాధవుట్టి..
సారా కొట్టు దారివట్టిన
ప్రతీసారి తప్పేదో 
చేసినట్టు తిట్టుతారు 
కొట్టుతారు అవ్వాబిడ్డలు..
డబ్బును లోకం ఏలుతుంది..
పైసకు నా పెళ్ళాం బానిసయింది ..
చరవాణి స్నేహం విడలేని 
నా కూతురు ఊహలోకం వదిలి రానంది…
పైసను సంపాదించే యంత్రాన్ని నేను..
అవసరాలు తీర్చే వస్తువు నేనే..
అంతర్జాల పోకడల మలుపు చూసి ..
ఆవేదనతో నవ్వుతుంది నా నడిఈడు వయసు…
నాన్న అన్న పిలుపు లేక 
నాలుగేండ్లు దాటిపోయే..
ఓయ్ అన్న మాట కరువై 
బ్రతుకు నన్ను వెక్కిరించే..
తాళి కట్టిన అలినాకు ఉరితాడుల కనిపించ వచ్చే..
కడుపున పుట్టినబిడ్డ నాకు 
కాటిలాగా తోచవచ్చే..
నాలోన ఉరికే ఇదంతా డబ్బు మాయ ..
సచ్చిపోయే ఆశబుట్టి 
నా అడుగులు సాగబట్టే ..
ఆశనాలో సచ్చిపోయే ..
లేని అవ్వ గుర్తువచ్చే..
దూడపాక శ్రీధర్..
కూచిరాజ్ పల్లి ,( మంథని )

Related posts