telugu navyamedia
సినిమా వార్తలు

8 నెలల గర్భంతో షూటింగ్​లో హీరోయిన్​

బాలీవుడ్​ కథానాయిక నేహా ధూపియా ప్రస్తుతం 8 నెలల గర్భిణి. గర్భంతో ఉన్నప్పుటికీ, చురుగ్గా చిత్రీకరణలో పాల్గొంది  హీరోయిన్. అదీ కూడా పోలీస్ అధికారిణి పాత్ర కావడం మరో విశేషం.

Neha Dhupia bridges the gap between reel and real as she plays a pregnant cop in 'A Thursday' | PINKVILLA

గ‌ర్భంతో ఉన్న‌ప్ప‌టికీ నటనకు విరామం ఇవ్వకుండా ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొంటోంది. మరో విశేషమేంటంటే తెరపై గర్భిణీ పోలీస్​ అధికారిణిగా నటిస్తోంది. ఆ చిత్రమే ‘ఏ థర్స్​డే’. జేహ్​జాద్​ ఖంబాటా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యామీగౌతం, డింపుల్​ కపాడియా, అతుల్​ కులకర్ణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Neha Dhupia dons role of a pregnant cop in 'A Thursday' | Hindi Movie News - Times of India

ప్ర‌తిరోజూ జ‌రిగే సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమా తెర‌కెక్కిస్తున్నారు.  దీనిపై నేహా ధూపియా ఆనందం వ్యక్తం చేసింది. నిజ జీవితానికి, తెర జీవితానికి మధ్య అంతరాన్ని చెరిపేసే పాత్రను పోషిస్తుండటం మరపురాని అనుభూతి అని నేహా పేర్కొంది. ఈ చిత్రంలోని తన లుక్​ను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా కావ‌డంతో త‌మ‌దైన శైలిలో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Related posts