telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” : ఆకట్టుకుంటున్న మొదటి పాట

Nee Neeli Kannullona Lyrical Song,Dear Comrade

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈరోజు ఉదయం 11:11 గంటలకు “నీ నీలి కన్నుల్లోన…” అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు చిత్రబృందం. ఈ పాటను గౌతమ్ భరద్వాజ అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. నవీన్ యర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదలైన మొదటి పాట యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేశారు. మీరు కూడా ఈ పాటను వినండి.

Related posts