ఇటీవలే పెళ్లి చేసుకున్న లవ్‌బర్డ్స్ నయనతార- విఘ్నేష్ శివన్.. హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో సరదాగా గడుపుతున్నారు. ఈ మేరకు రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విఘ్నేశ్.
జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో విఘ్నేష్ శివన్, నయన తార పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి తర్వాత తిరుమలకు వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకున్నారు.
వివాహం అనంతరం ఈ న్యూ కపుల్ వారి హనీమూన్ కోసం బ్యాంకాక్, థాయ్‌లాండ్‌కు వెళ్లారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ తెలియజేశారు. వారుంటున్న హోటల్ ఫొటోలను తన సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.