telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రెండోసారి ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియాగాంధీ..

*ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సోనియాగాంధీ
*సోనియా గాంధీతో పాటు ఈడీ ఆఫీసుకు రాహుల్‌ గాంధీ
*నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులోవిచార‌ణ‌

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి మంగ‌ళ‌వారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్​ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు.

మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్​కు బీజేపీ భయపడే ఈడీని పంపిస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈనెల 21న జరిగిన విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది. పార్టీ అధినేత్రి విచారణ నేపథ్యంలో ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నిరసనలు చేపట్టింది. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్​ ఎంపీలను నిర్బంధించారు. దాదాపు 75 మంది కాంగ్రెస్​ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

Related posts