telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అప్పులకోసం తప్పటడుగులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి దయనీయంగా మారింది. అప్పులు చేస్తేగానీ పూటగడవని పరిస్థితి దాపురించిందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని లోక్ సభలో వేడుకున్నారు.

ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ, నియంత్రణ దాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని లోక్ సభలో పేర్కొన్నారు. రాష్ర్ర్ట ప్రభుత్వం రాజ్యాంగం లోని 293 నిబంధనను ఉల్లంఘించడమేనని ప్రస్తావించారు. రాష్ర్టం , బ్యాంకులు కుప్పకూలుతాయని, తక్షణం ప్రధాని జోక్యం చేసుకోవాలి అని లోక్ సభ జీరో అవర్ లో కోరారు.

Related posts